Posts

Showing posts from September, 2019

OM NAMO NARAYANAYA Chanting Mantra Meditation | Narayana is the Supreme ...

Image

మహాలయ అమావాస్య..కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.

*మహాలయ అమావాస్య.....* దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి -  దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు  బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది.. ''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్ర

మౌనవ్రతం వలన కలిగేలాభాలు!

మౌనవ్రతం వలన కలిగేలాభాలు! మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయనే గర్వం..ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి. వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు. మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రత

శ్రీ దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.

*శ్రీ  దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.ఇక్కడ గౌతమ్ మహర్షి ఘోర తపస్సు చేసిన స్థలం.నచికేత్,యమునికి సంభందించిన కధ ఇక్కడే జరిగింది. నచికేత్ యముడి కోసం తపస్సు చేయగా యముడు జ్ఞాన బోధ చేసిన ప్రాంతం.ఇక్కడ దత్త మూర్తి ఆదిశంకరులు వర్ణించిన యోగ లో ఉన్న షట్ చక్రాలు దత్త మూర్తి లో కలిగిన సాలిగ్రామo తో చేయబడిన సుందర  ధ్యాన మూర్తి దత్త.స్వామి వక్షస్థలంలో  అగ్ని,గోముఖ్o, నొసటన అజ్ఞాచక్రం, గొంతు దగ్గర విశుద్ది చక్రం,నాభి లో మణి పూరకం,హృదయం దగ్గర కమలం,క్రిందగా 4 రేకులు కలిగిన ములధార చక్రం అనాహిత చక్రాలు సూక్ష్మంగా కనపడతాయి.ఈ విగ్రహం నల్లగా ఉన్న సాలిగ్రామ మూర్తి.ఇక్కడ ఔదుంబర్ వృక్షం లో స్వయంభూ గణపతి వున్నారు.ఇక్కడ గురుచరిత్ర పారాయణ జరుగుతుంది.సప్తాహ  పారాయణ చేసుకునే వారికి భక్త నివాస్ ఉంది.భోజనం కూడా దొరుకుతుంది. శ్రీ క్షేత్ర బాలోద్, తాలూకా జగడియా,జిల్లా బరూచ్,గుజరాత్. Ph no.02645-243603 M.no _07738360880 Th anks to sai SARANAM Shirdi tour, Chennai 9840344634 / 9087666333 www.saisaranam .in

కాశీ.....#Vandanam కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు.

కాశీ.....#Vandanam కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం... కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. స్వయంగా శివుడు నివాసముండె నగరం. ప్రళయ కాలంలో మునగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.... ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చ