Posts

Showing posts from 2019

గుడికి ఎందుకు వెళ్ళాలి?*

Image
*గుడికి ఎందుకు వెళ్ళాలి?* మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం. మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్

Chennai Flight 2 day Package

Chennai Flight 2 day Package VIA MUMBAI Chennai to Mumbai by Flight- Mumbai to shirdi by AC Bus - Return to Pune by AC Bus - Pune to Chennai By Flight (Includes Food and Accommodation). Day 1: Shirdi Darshan From Chennai airport at 3.30 AM, Board flight to Mumbai, arrive Mumbai airport at 6.45AM Our A/C HI - Tech bus will start from airport to Shirdi. On the way Shirdi vinayaka Darshan, Breakfast , Maha lakshmi temple darshan at Mumbai. Then to shirdi on the way Buffet south indian lunch and reach to Shirdi by 5 to 6 PM. Check in Hotel at Shirdi, will be provided followed refreshment. There after Buffet Dinner 8PM at hotel night halt at Shirdi. Day 2: Shirdi - Shanishignapur - Pune Morning breakfast at 7.30AM. Then to Darshan and Shopping span up to 11AM. Then 12 PM Check out from hotel with the buffet lunch, proceed to pune, on the way Darshan at Shanishignapur temple at 3 - 3.30 PM, Then proceed to pune. Buffet dinner at 7.30 - 8PM at hotel. Drop at pune airport at 9PM arr

రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి

రామేశ్వరజ్యోతిర్లింగ రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాందపురాణం ఎంతగానో వర్ణించింది. ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతులమీదుగా ప్రతిష్టించబడింది. రామేశ్వరస్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్ధాలు ఉన్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్ని తీర్థముగా చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగాజలన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రమునందలి ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటివరకు కొనసాగుతూనే వుంది. పురాణగాథ: త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతతో కలసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూచి పులస్త్యబ్రహ్మ క

రామానుజాచార్యుల వారి దివ్య దేహం....

*రామానుజాచార్యుల వారి దివ్య దేహం.....* భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీ రామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామ

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ అర్థం కాదు

కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ అర్థం కాదు .మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను అనుభవించాలి. నిందిస్తే ప్రయోజనం లేదు. రమణ మహాశయులు కాశీలో ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవారు. ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా  తో " కృష్ణా  ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు మీద పడినది .కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు .కృష్ణా అప్పుడు గ్రహించాడు . వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో "మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు .అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్ప

OM NAMO NARAYANAYA Chanting Mantra Meditation | Narayana is the Supreme ...

Image

మహాలయ అమావాస్య..కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.

*మహాలయ అమావాస్య.....* దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి -  దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు  బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది.. ''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్ర

మౌనవ్రతం వలన కలిగేలాభాలు!

మౌనవ్రతం వలన కలిగేలాభాలు! మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయనే గర్వం..ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి. వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు. మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రత

శ్రీ దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.

*శ్రీ  దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.ఇక్కడ గౌతమ్ మహర్షి ఘోర తపస్సు చేసిన స్థలం.నచికేత్,యమునికి సంభందించిన కధ ఇక్కడే జరిగింది. నచికేత్ యముడి కోసం తపస్సు చేయగా యముడు జ్ఞాన బోధ చేసిన ప్రాంతం.ఇక్కడ దత్త మూర్తి ఆదిశంకరులు వర్ణించిన యోగ లో ఉన్న షట్ చక్రాలు దత్త మూర్తి లో కలిగిన సాలిగ్రామo తో చేయబడిన సుందర  ధ్యాన మూర్తి దత్త.స్వామి వక్షస్థలంలో  అగ్ని,గోముఖ్o, నొసటన అజ్ఞాచక్రం, గొంతు దగ్గర విశుద్ది చక్రం,నాభి లో మణి పూరకం,హృదయం దగ్గర కమలం,క్రిందగా 4 రేకులు కలిగిన ములధార చక్రం అనాహిత చక్రాలు సూక్ష్మంగా కనపడతాయి.ఈ విగ్రహం నల్లగా ఉన్న సాలిగ్రామ మూర్తి.ఇక్కడ ఔదుంబర్ వృక్షం లో స్వయంభూ గణపతి వున్నారు.ఇక్కడ గురుచరిత్ర పారాయణ జరుగుతుంది.సప్తాహ  పారాయణ చేసుకునే వారికి భక్త నివాస్ ఉంది.భోజనం కూడా దొరుకుతుంది. శ్రీ క్షేత్ర బాలోద్, తాలూకా జగడియా,జిల్లా బరూచ్,గుజరాత్. Ph no.02645-243603 M.no _07738360880 Th anks to sai SARANAM Shirdi tour, Chennai 9840344634 / 9087666333 www.saisaranam .in

కాశీ.....#Vandanam కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు.

కాశీ.....#Vandanam కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం... కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం. స్వయంగా శివుడు నివాసముండె నగరం. ప్రళయ కాలంలో మునగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.... ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చ

కాలభైరవ స్వామి.....*

* కాలభైరవ స్వామి..... * ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి... సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ.. అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే ని పుట్టుక కు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను ,నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా,కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. ఋగ్వేదం... అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ,ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో ,అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. యజుర్వేదము..