Posts

Showing posts from November, 2021

18-11-21 or 19/11/21- పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి*ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం 2.27 నిమిషాలు వరకు

Image
*పౌర్ణమి తిధి నిర్ణయం-సంశయ నివృత్తి* ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం  2.27 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం. దీనిని మిగులు. తగులు. అని అంటారు. పెద్దగా కంగారు పడవలసిన పని లేదు.  సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని  ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి. అదేవిధంగా పౌర్ణమి కూడా. రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే. ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు, సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మీకు తెలుసనుకుంటున్నాను. ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా. లక్ష్మివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది.. ఆ విధంగా పౌర