క్షీరాబ్ది ద్వాదశి*, *చిలుకు ద్వాదశి* ( update on 12-11-2024)
🙏🌺🙏🌺🙏🌺🙏 _*క్షీరాబ్ది ద్వాదశి*_ _*చిలుకు ద్వాదశి*_ 🌸🌸🌸🌸🌸🌸 🌸🌸🌸🌸🌸🌸 *క్షీరాబ్ది ద్వాదశి క్షీరసాగరమథనంలోని ఆంతర్యం!* కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. దేవదానవులు ఈ రోజునే సాగరాన్ని మథించడం మొదలు పెట్టారు కాబట్టి ఈ రోజుని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఇంతే కాకుండా యోగీశ్వర ద్వాదశి అనీ, మథన ద్వాదశి అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు, క్షీరసముద్రం మీద శయనించిన విష్ణుమూర్తి నిదుర లేచి, బ్రహ్మాదిదేవతల సమేతంగా బృందావనం (తులసివనం)లోకి ప్రవేశిస్తారట. అందుకని ఈ రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి సకల శుభాలూ కలుగుతాయంటారు. ఇక కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉన్న ప్రాధాన్యత కూడా సామాన్యం కాదు. ఉసిరి చెట్టు నీడ పడిన నీటిలో స్నానం చేసినా, సాయంవేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని ఉంచినా విశేషఫలితం దక్కుతుందని పెద్దల మాట. క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోటలో విష్ణుమూర్తి రూపాన్నీ, ఉసిరి కాయతో కూడిన ఉసిరి కొమ్మనీ ఉంచి ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః అన్న మంత్రాన్ని జోడిస్తూ దీపారాధన, సంకల్పం, కలశపూజ, ష