Showing posts with label Tirupati. Show all posts
Showing posts with label Tirupati. Show all posts

Sunday, 30 November 2025

తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. - December month 2025 festivals

తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు..
                 

డిసెంబర్‌ 01 సోమవారం - 
గీతా జయంతి, మోక్షద ఏకాదశి

#డిసెంబర్‌ 02 మంగళవారం - 
ప్రదోష వ్రతం

#డిసెంబర్‌ 03 బుధవారం - 
జ్యేష్ఠ కార్తె

#డిసెంబర్‌ 04 గురువారం - 
పౌర్ణమి, దత్త జయంతి. 

#డిసెంబర్‌ 07 ఆదివారం - సంకటహర చతుర్థి.

#డిసెంబర్‌ 15 సోమవారం - 
మూల కార్తె, ఏకాదశి.

#డిసెంబర్‌ 16 మంగళవారం - ధనుర్మాస పూజ, ధనుర్మాసం ప్రారంభం.

#డిసెంబర్‌ 18 గురువారం - మాస శివరాత్రి.

#డిసెంబర్‌ 19 శుక్రవాంర - 
అమావాస్య

#డిసెంబర్‌ 24 బుధవారం- 
క్రిస్మస్ ఈవ్

#డిసెంబర్‌ 25 గురువారం - 
క్రిస్మస్.

#డిసెంబర్‌ 26 శుక్రవారం -  
స్కంద షష్టి.

#డిసెంబర్‌ 27 శనివారం - అయ్యప్ప స్వామి మండల పూజ.

#డిసెంబర్‌ 28 ఆదివారం - పూర్వాషాఢ కార్తె.

#డిసెంబర్‌ 30 మంగళవారం - 
పుష్య పుత్రాద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.```

*డిసెంబర్‌ 2025- పౌర్ణమి, ఏకాదశి తిథులు*```

పౌర్ణమి డిసెంబర్ 4వ తేదీ 8:38 AM నుంచి డిసెంబర్ 5వ తేదీ 4:44 AM వరకు.

అమావాస్య డిసెంబర్ 19వ తేదీ 4:59 AM నుంచి డిసెంబర్ 20వ తేదీ 7:13 AM వరకు.```


#*తిరుమలలో డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు.. ఏ రోజు ఏంటి?*```

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 
ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 

2వ తేదీన మంగళవారం- 
చక్రతీర్థ ముక్కోటితో డిసెంబర్ నెల విశేష ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ అధికారులు. 

శ్రీవారి ఆలయంలో 4వ తేదీన- గురువారం కార్తీక పర్వ నిర్వహిస్తారు. అదే రోజున తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర ఉంటుంది. 

5వ తేదీన శుక్రవారం తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమం జరుగుతుంది.



16న మంగళవారం నాడు- 
ధనుర్మాసం ఆరంభమౌతుంది. 
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావైని వినిపిస్తారు. ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసం ముగిసేంత వరకూ 
ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 

19వ తేదీ శుక్రవారం తొందార్పప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవం ఉంటుంది. అదే రోజున శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి. 

డిసెంబర్ 29న సోమవారం శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొరను నిర్వహిస్తారు.

30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యేది ఆ రోజే. జనవరి 8వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. అదే రోజున శ్రీమలయప్ప స్వామివారు.. దేవేరులతో కలిసి స్వర్ణ రథోత్సవం మీద ఊరేగుతారు. 

31న బుధవారం నాడు వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు, శ్రీవారి చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.

నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

Saturday, 21 December 2024

*తిరుమల- *బీబీ నాంచారమ్మ ఎవ్వరు..*

*తిరుమల- *బీబీ నాంచారమ్మ ఎవ్వరు..*

🕉️ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగురించి తెలియని వారుండరు.🕉️ అలాగే చాలామందికి "బీబీ నాంచారమ్మ" గురించి
చాలా అపోహలు ఉన్నాయి.🕉️ అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు?🕉️
 ఆమె నిజంగానే ముస్లిం వనితా? ఆమె దైవస్వరూపం ఎలాఅయ్యారు?...🕉️

 🕉️బీబీ నాంచారమ్మ! "నాచియార్" అనే తమిళపదం నుంచి "నాంచారమ్మ" అన్న పేరు వచ్చింది. 
అంటే భక్తురాలు అని అర్థం...🕉️

ఇక "బీబీ" అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిదికాదు. కనీసం 700 సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచిఉంది...🕉️

 బీబీ నాంచారమ్మ, 'మాలిక్ కాఫిర్' అనే సేనాని కుమార్తె. ఆమె అసలుపేరు సురతాని.
స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగామారి తానుకూడా ముస్లింమతాన్ని స్వీకరించాడు.🕉️

 తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు.
తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు...🕉️

అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంతో ధనమొస్తుంది కదా అనుకున్నాడు.🕉️
అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని హస్తినకి బయలుదేరాడు...🕉️

 హస్తినకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటిమధ్య శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రినడిగింది. ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం,
పట్టువస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం...🕉️

అలా తనకుతెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కో రోజూ గడుస్తున్నకొద్దీ దానిమీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో,
రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ, పూజారులు అంతే బాధలో మునిగిపోయారు.
చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు హస్తినకి ప్రయాణమయ్యారు....🕉️

 రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు భక్తుల విన్నపాలుచూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరిం అన్చాడు.
అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని మాత్రం విగ్రహం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయితే అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రపోయే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరుదాటించారు...🕉️

 సురతాని ఉదయాన్నే లేచిచూస్తే విగ్రహం కనుమరుగైంది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తానుకూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు.
ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు...🕉️

 మరొక కధ ఏమిటంటే : ఆ విగ్రహం రంగనాథునిదికాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలోకూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమెకూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహంకూడా కనిపిస్తుంది.
ఏదేమైనా ఆమె "ముసల్మాను స్త్రీ" అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూలేదు...🕉️

🕉️ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించేకాలంలో, అతను ఓసారి తిరుమలమీదకు దండయాత్రకు వచ్చాడట.

అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెల్సుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ !!!!.

🙏🌍లోక సమస్త సుఖీనో భవంతు🌍🙏


చిత్రగుప్తుడు ఎవరు?

పురాణాల (ముఖ్యంగా పద్మ పురాణం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం మొదలైనవి) ప్రకారం, చిత్రగుప్తుడు బ్రహ్మ దేవుని మానసపుత్రుడు (మనస్సు నుంచి ఉద్భవ...