Monday, 25 October 2021

thiruvanamalai miracle- పటిక బెల్లం లో మూడవవంతు* అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన

*పటిక బెల్లం లో మూడవవంతు* 

అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన 
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.

ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదే మీ శిక్ష అన్నాడు.
పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.
అద్భుతం!!
మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గార్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.
అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.
ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.
సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??.

నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బందియే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .

 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
(సేకరణ)
Thiruvanamalai tours by sai saranam
www.saisaranam.in
9840344634
8925688570

No comments:

Post a Comment

Melkote idol Walks to near Ramanujachary

The devotional legend of Ramanujacharya retrieving the utsava murti (Selva Pillai or Ramapriya) from Delhi, the idol is said to have miracul...