Saturday, 30 September 2017

Lalitha sahasranamam

లలితాదేవి సహస్రనామ స్తోత్రం
చదివితే ఎమోస్తుంది.
క్రింద ఇవ్వబడిన వివరణ చూసి అందరూ చదవండి.

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్రణం స్తోత్రాన్ని చదువ్తూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంభందించిన సమస్త యోగక్షేమాలను తానే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం…..కాని బాహ్యం లో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లేక్కపెట్టలేనన్న్ని. “సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్” అంటే ఖచితంగా లేకపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరo. భగవంతుడు/భగవతి ఒక సాకారమును దాల్చింది. అది దేవతల అదృష్టం, దేవతల వలన మనం పొందిన అదృష్టం. ఒకవేళ అమ్మవారి దగ్గరకు వెళ్లి పేరు పెట్టి అదే పనిగా లలితా…..లలితా…..లలితా….. అన్నామనుకోండి మనకి ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా!!! తెలియదు. అలా ఒక 1000సార్లు లలితా…..లలితా…..లలితా….. అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా!!! లేకపోతే అమ్మవారికి కొన్ని పేర్లు చెప్తే ఏమైనా తెలుస్తుందా… అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము. నామములు గౌనములు. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణంప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి. ఎదో ఒక నామం దగ్గర ఒంటి మీద వెంట్రుకలు నిక్కపోడుచుకుని కన్నుల నీరు వచ్చి”అమ్మా!! ఇంత దయ కలిగిన దానివా తల్లీ…..ఇన్ని గుణములా….. ఈ గుణములన్ని మమల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటు వంటి గుణములా….లేకపోతే అసలు గుణముల యెక్క అవసరం అసలు నీకేంటి….నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి….నీవు అటువంటి తల్లివి. గుణములను ప్రకాశించేటట్టుగా అవసరం ఇచ్చారు”. పిల్లాడికి అజ్ఞానం లేకపోతే, మన్నిoచేటటువంటి గుణం అమ్మదెలా ప్రకాశిస్తుంది. పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయా అనే గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వాడ్ని జ్ఞానమంతుడ్ని చేయగలిగినటువంటి ఔదార్యము, అటువంటి శక్తి అమ్మవారి యందు ప్రకాశించింది. గుణంగా అమ్మవారి యందు ప్రకాశించిన గుణములు మమల్ని ఉద్దరించడానికి పనికి వచ్చింది తప్ప అమ్మవారి యందు ప్రకాశించినటువంటి గ్గుణములు అమ్మవారిని ఉద్దరిచుకోవడానికి పనికి వచ్చేవి కాదు.

22 Wells - Rameshwaram (with meanings & believed benefits):

The Ramanathaswamy Temple in Rameshwaram, Tamil Nadu, is famous not only for its architectural grandeur but also for its 22 sacr...