రామ పదం గొప్పది. రామ, శ్రీ రామ, జై రామ
రామ" శబ్దము బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాడు. ఇకనేం! బ్రహ్మ లోకం నుండి భూలోకం వచ్చాడు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక బోయవాడు తటస్థపడ్డాడు. అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు. అతడు హింసాయుత కర్మాచరణలో ఉన్నాడు. అపమార్గంలో నడుస్తున్నాడు. అతడిని ఈ మార్గంనుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలి అనుకొన్నాడు. "రామ" అను శబ్దమును ఉపదేశించాడు. పట్టుదలతో జపించమన్నాడు. బోయవాడు శ్రద్దతో విన్నాడు. అదేపనిగా మనసులో స్మరిచుకుంటూ, కొంతసేపు, మరికొంతసేపు ఉచ్చరిస్తూ అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. తనపట్టుదలను వదలలేదు. ధృఢచిత్తంతో అలానే ఉన్నాడు. చుట్టూ పుట్ట వెలసింది. చిక్కిశల్యమయ్యాడు. పుట్టాకోనలనుండి, దివ్యకాంతులు ప్రసరిల్లుతున్...