తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు. వారికిచ్చిన మాటను ఆయన యధా నిలుపుకుంటాడు.

తనను నమ్మిన భక్తులను బాబా
జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు.
వారికిచ్చిన మాటను ఆయన యధా
నిలుపుకుంటాడు. అలాంటి ఉదంతం మనకు ఈ కథ
ద్వారా తెలుస్తుంది.
ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తు ఉన్నారు.
కొంత దూరం ప్రయానించిన తర్వాత ఒక
చెట్టు కింద కూర్చుని విశ్రాంతి
తీసుకుంటున్నారు. చిలుము వెలిగించుకోవడానికి
ప్రయత్నించుచుండగా ఒక కప్ప
బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అంతలో
ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి
చిలుము వెలిగించే ఆయనకు అందించెను.
భోజనానికి రావల్సిందిగా బాబాను ఆహ్వానించెను.
మరలా కప్ప బెకబెకలాడెను. ఆ భక్తుడు అదేమి
గమనించలేదు. కానీ, ఆ కప్ప శబ్దం విన్న బాబా
ఆ కప్ప పూర్వ జన్మ పాపం అనుభవిస్తోందని
చెప్పెను. పూర్వ జన్మ
ఫలం అనుభవించవలసినదే. తప్పదు అని బాబా
పలికెను. అప్పుడు ఆ వ్యక్తి కప్ప ఉన్న
చోటుకి వెళ్లి చూసెను. ఆ కప్పను పాము నోట్లో
కరుచుకొని వుంది. అది చూసి వచ్చి అతను బాబాతో
- పది నిముషాల్లో పాము ఆ కప్పను మింగేస్తుంది
అని చెప్పేను. దానికి బాబా - అలా జరుగదు.
నేను తండ్రిని. అలా ఎప్పటికీ జరుగనివ్వను. ఆ
పాము కప్పను తినలేదు. తప్పకుండా
విడిపిస్తాను చూడు అన్నారు.
కాసేపు చిలుము పీల్చిన తర్వాత బాబా కప్ప
వున్న చోటుకి వెళ్లెను. బాబాను పాము దగ్గరగా
వెళ్లవద్దని ఆ వ్యక్తి హెచ్చరించాడు. బాబా
అతని మాట పట్టించుకోకుండా, ముందుకు వెళ్లి, -
వీరభద్రప్పా, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప
జన్మెత్తి తన తప్పు తెలుసుకున్నాడు.
నీవు పాముగా పుట్టి నీ తప్పు తెలుసుకోలేదా...
అతనిపై ఇంకా శత్రుత్వమా... నీకు సిగ్గుగా
లేదా... ఇప్పటికైనా ఈ పగ విడిచిపెట్టు అని
పలికెను. బాబా మాటలు విన్న పాము,
కప్పను విడిచి నీటిలోకి వెళ్లిపోయింది. కప్ప కూడా
తన దారిన పొదలలోకి వెళ్లిపోయింది. ఇదంతా
చూస్తున్న ఆ వ్యక్తికి ఒక్క నిముషం ఏమీ
అర్థం కాలేదు.     సాయి.........

Comments

Popular posts from this blog

Tirupati to Tirumala by walking

thiruvanamalai miracle- పటిక బెల్లం లో మూడవవంతు* అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన

క్షీరాబ్ది ద్వాదశి*, *చిలుకు ద్వాదశి* ( update on 12-11-2024)