‘ది సేక్రెడ్ ఫుడ్ ఆఫ్ గాడ్’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు)
‘ది సేక్రెడ్ ఫుడ్ ఆఫ్ గాడ్’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) - ‘సేక్రెడ్ ఫుడ్స్ ఆఫ్ గాడ్’....తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు... ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం! అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్ ఫుడ్ ఆఫ్ గాడ్’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం రాశారు. దాని తొలి ప్రతిని ఆయన అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించారు. ఏడు కొండల వాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను రమణ దీక్షితులు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం... సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలత...