Friday, 29 April 2022

లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి

హయగ్రీవుడు చదువులకు అధిదైవం. అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది.

శ్రవణానక్షత్రం ఏ పూర్ణిమనాడుంటే ఆ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం. పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టినతిథి. ఆ రెండు కలిసిన శ్రావణపూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే ‘హయగ్రీవ జయంతి’. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించి, గుఱ్ఱపు మోముగల ఒక వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది.

శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున
శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి.

“జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే”

గుర్రపుముఖంతో, నరశరీరంతో, చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే.

హయగ్రీవస్వామిహయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ .
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః .
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం
వాదిరాజయతిప్రోక్తం పఠతాం సంపదాం పదం

.. ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణం ..

రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా అర్చించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.

No comments:

Post a Comment

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...