Monday, 10 February 2025

పాతాళ గణపతి ఆలయం, శ్రీకాళహస్తి....!!**శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకు 40 అడుగుల లోతు లోని రాతి గుహలో కొలువై ఉన్నాడు.

పాతాళ గణపతి ఆలయం, శ్రీకాళహస్తి....!!*

*శ్రీకాళహస్తిలో  పాతాళ వినాయకుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకు 40 అడుగుల లోతు లోని రాతి గుహలో కొలువై ఉన్నాడు.*

*పంచభూత లింగాలలో శ్రీ కాళ హస్తి క్షేత్రం ఒకటి ఇక్కడ అ పరమేశ్వరుడు వాయు లింగేశ్వర గా పార్వతి దేవి జ్ఞానాంబికగా పూజలందుకుంటున్నారు.*

*ఇదే క్షేత్రంలో వారి ముద్దుల కుమారుడు గజాననుడు కూడా పాతాళ గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడా లేని విధంగా భూతలానికి 40 అడుగుల దిగువన ఒక రాతి గృహలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి విశేషం ఆ విశేషం ఏమిటో తెలుసుకుందాం.*

*పాతాళ గణపతి ప్రస్తావన వందల ఏళ్ల నాటి కావ్యాలలోని ఉందని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడు శ్రీ నాథుడు రచించిన హరవిలాసం శివపురాణంలో కాళహస్తి వినాయకుడి గురించి పేర్కొన్నట్లు చరిత్ర చెబుతుంది.*

*స్థల పురాణాన్ని చూస్తే కాళహస్తిలో జీవనదిని ప్రవహింపచేయాలన్న ఉద్దేశంతో అగస్త్యుడు పరమశివుని ప్రార్థించాడు.*
*అగస్త్యుని తపోబలనికి పరమ శివుని అనుగ్రహం తోడై స్వర్ణముఖి నది ఆవిర్భవించింది.*

*నది ఏర్పడింది కానీ అందులో నీళ్లు లేవు ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచించగా సకల శుభాలకు మూలం గణపతి ఆరాధన చేయకుండానే తపస్సుకు పూనుకున్న విషయం గుర్తొస్తుంది.*

*ఆ తప్పును సవరించుకోడానికి గజాననుని అనుగ్రహం కోసం మళ్లీతపస్సు మొదలుపెడతారు.*

*అసుర సంహారం చేసి పాతాళమార్గం ద్వారా వస్తున్న వినాయక స్వామి అగస్త్యుని గమనించి అతనికి దర్శన భాగ్యం కల్పిస్తారు.*

*అతని కోరిక మేరకు స్వర్ణ ముఖి లో జలధార కురిపిస్తాడు. తనకు దర్శనం ఇచ్చిన చోటే కొలువు తీరమని గణపతిని కోరటంతో అక్కడే స్వామి పాతాళ గణపతిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు*

*రాతి గుహలో వినాయకుని దర్శించుకోవాలంటే భక్తులు ఒంపులు తిరిగి ఉండే 30 మెట్లను జాగ్రత్తగా దిగి లోపలికి చేరుకోవాలి ఒకప్పుడు స్వర్ణ నది నీటిమట్టం ఎంత పెరిగితే స్వామి వారి దగ్గర అంత ఎత్తులో నీళ్లు ఉరేవట..!*
*కానీ ఇప్పుడు అక్కడ టైల్స్ వేయడంతో నీటి జాడ కనిపించడం లేదు..*

*జై..పాతాళ గణపతిం..*
*స్వస్తి..*
*ఓం గం గణపతయే నమః*

🙏 *సర్వేజనా సుఖినోభవంతు*

No comments:

Post a Comment

Marathwada Liberation Day or Marathwada Mukti Sangram Din—is celebrated every year on 17th September

Marathwada Liberation Day or Marathwada Mukti Sangram Din—is celebrated every year on 17th September to mark the liberation of the Marathwad...