Saturday, 27 July 2019

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు
న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.
సూర్యుడు
శ్రీ‌కాకుళం జిల్లా
1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పుగోదావ‌రి
2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పగోదావ‌రి
3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి
క‌ర్నూలు
4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి
చంద్రుడు
ప‌శ్చిమ గోదావ‌రి
1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం).
తూర్పుగోదావ‌రి
2. కోటిప‌ల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ
3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు
4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు.
అంగార‌కుడు
కృష్ణ
1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం
తూర్పుగోదావ‌రి
2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం
గుంటూరు
3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురి లాంటి నృసింహ క్షేత్ర దర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది
బుదుడు
ప‌శ్చిమ గోదావ‌రి
1. ద్వార‌కా తిరుమ‌ల‌
తూర్పుగోదావ‌రి
2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి.
కృష్ణ
3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
చిత్తూరు
4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి.
బృహ‌స్పతి
గుంటూరు
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్
2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావ‌రి
3.కోటి ప‌ల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు
4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి. , కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి.
శుక్రుడు
విశాఖ
1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి,
పింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
చిత్తూరు
2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీ దేవి.
నెల్లూరు
3. పెంచ‌ల‌కోన ఆది ల‌క్ష్మీదేవి.
శ‌ని
తూర్పగోదావ‌రి
1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి.
అనంత‌పురం
2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు
కృష్ణ
3. విజ‌య వాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి
ప్రకాశం
4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి.
రాహువు, కేతువు
చిత్తూరు
1. శ్రీ కాళ‌హ‌స్తి
తూర్పుగోదావ‌రి
2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి
కృష్ణ
3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గా దేవి.
విశాఖ
4. సంప‌త్ వినాయ‌క స్వామి.
గుంటూరు
5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి,
తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.
గుంటూరు జిల్లాలో పెద్దకాకాని...
సర్వేజనా సుఖినోభవంతు..
www.saisaranam.in
స్వస్తి..

Monday, 22 July 2019

తథాస్థు దేవతలు అంటే ఎవరు ?

* తథాస్థు దేవతలు అంటే ఎవరు ?

వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మనచి జరుగుతుంది.☘🍀

Sunday, 21 July 2019

తిరుమల తిరుపతి ధ్వజస్తంభం కథ

కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల
పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల
ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం
చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్
రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.
వందల కంఠాలు"గోవిందా! గోవిందా!"
అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి
నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి
గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ
చేరుకుంది. డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.
కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి.
చుట్టూ చూశాడు. వేలాది యువతులు
హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ
తన్మయులైనారు.

అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డిగారికి,
ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి
నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు,
ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి.
ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం.
ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ
మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు
దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు
దొర్లిపడవచ్చు,మీరు హామీ ఇస్తే పైకి చేర్చి
తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో
పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి
అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను,
పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు
బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ
బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే
మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి.
పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ  లోయలో పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.
ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ
సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..
సూర్యాస్తమయం లోగా
ట్రాలీ తిరుమల చేరిపోయింది.
వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో
గోవిందా..గోవిందా..నామస్మరణతో
తిరుమల కొండ ప్రతిధ్వనించింది!
☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం
దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న
ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు
క్షేమంగా చేరుకున్నాయి👌

🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?

నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు
టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు.
అందులో భాగంగానే  ధ్వజస్థంభానికి బంగారు
తాపడానికి పాలిష్ చేయడం.
నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన
ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు
ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు.
ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!
అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య!
ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల
గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో
అసలు విషయం బయటపడింది.
ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే
ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో
ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు?
మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచిఉంది?
కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది.
రేపో మాపో అది కూలిపోవచ్చు!
మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?
వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో
చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు
బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు!
కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్!
స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.
స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం
జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.
అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం"
అని ప్రకటించారు👌
ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!

🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం
ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.
ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,
కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న
ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక
కల్గిన టేకు చెట్టు అయివుండాలి.
ఎక్కడ? ఎక్కడ?
ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?
☘పాత మాను గురించి తెలుసుకుంటే
దొరుకుతుంది అని 190 సంవత్సరాల
రికార్డులన్నీ పరిశీలిస్తే..
ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు.
మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి
నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం.
ఈ కొద్ది రోజుల్లో మనం.....
ఇది చేయగలమా????ప్రశ్నలు???

🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన
ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు
ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు
రేడియోలో విన్నాను. అటువంటి మానులు
కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.
మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను!
వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి,
అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా
ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో
కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావుగారు
కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి
వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.
ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.
ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా
ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు.
సమస్య అక్కడితో అయిపోలేదు.
దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని
మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి
తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే
బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..
సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం
మాకు ప్రసాదించండి అని..దుంగల్ని
క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు.
ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ
బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు
లేకుండా తిరుమల చేరుకుంది!
1982 జూన్ 10వ తేదీన
ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!

🍁ఉత్సవం చివరన నాగిరెడ్డిగారు ట్రైలర్
యజమానికి 70 వేల రూపాయల చెక్కును
అందించారు! యజమాని..
"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు
ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"
అని దానిని తిరస్కరించారు!
డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.
స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,
ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను
సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!
అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో
కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన
ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి
సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..
ఆయన రెండు చేతులూ జోడించి
ఆనందడోలికల్లో మునిగిపోయారు!
               🕉
www.saisaranam.in

Monday, 8 July 2019

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే.....*

*ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే.....*

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంతికీ గుమ్మం ముందు ఏమి ఉంటె లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఓసారి చూద్దాం.. ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి. ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని.

ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.

లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేల కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒక పువ్వులు పెడితే మంచిది.

గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రాగి రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.

ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుఅవకాశం ఉంటుంది. దేవుడి దగ్గర అవాహనాది పూజ సపర్యలు మరియు మంత్ర జపం చేసిన లక్ష్మి యంత్రం పెట్టిన కూడా మంచి శుభఫలములు కలుగును.

*|| ఓం నమః శివాయ ||*

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...