Sunday, 8 September 2019

మహాలయ అమావాస్య..కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.

*మహాలయ అమావాస్య.....*

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి -  దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు  బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.

ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది..

''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణములు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

*|| ఓం నమః శివాయ ||*

Spiritual message by sai SARANAM Shirdi tour, Chennai.
www.saisaranam.in
9840344634 / 9087666333

Thursday, 5 September 2019

మౌనవ్రతం వలన కలిగేలాభాలు!

మౌనవ్రతం వలన కలిగేలాభాలు!
మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయనే గర్వం..ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి.

వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు.

మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం. ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.

ఎంత కోపం వచ్చినా, మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు. తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే. తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు, అశాంతి ఉండవు. ప్రపంచమంతా నిశ్చలంగా కనిపిస్తుంది. మాట విలువు తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. మనల్ని మనం సైలెంట్ గా ఉంచుకోవడం ద్వారా అవతలి వారు చెప్పేది వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది. నోటివెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్రసాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది. ఈ సిద్ధి ఉన్నవాళ్లు అన్నది వెంటనే జరిగిపోతుంటుంది. మంచి అయినా చెడు అయినా, వీరు అనగానే ఇట్టే ఫలితం కళ్లముందు కనిపిస్తుంది. మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు. మనకు తెలియకుండానే రోజూ మాట్లాడుతూ, నోటికి చాలా పనికల్పిస్తుంటాం. ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే మన శరీర భాగాలకు కాస్త రెస్ట్ ఇవ్వడం కోసమే, పూర్వీకుల ఇలాంటి వ్రతాల్ని కనిపెట్టారు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది. పరిమితమైన వాక్కు మొత్తం శరీరానికి మంచిది.

వారంలో కేవలం ఒక్కరోజు మౌనవ్రతం చేస్తే పోయేదేమీ ఉండదు. మనలోని వాక్శక్తి ఆదా అవడంతో పాటు, అనవరపు తగాదాల్ని అడ్డుకునే ఈ  మౌనవ్రతం, మనిషికి చాలా అవసరం. వివాదాలకు హద్దులేని నేటి సమాజంలో అత్యవసరం.
                            spirtual message by sai saranam shirdi stours
www.saisaranam.in 9840344634 / 9087666333
 స్వస్తి!

Wednesday, 4 September 2019

శ్రీ దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.

*శ్రీ  దత్త క్షేత్ర బాలోద్*
శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.ఇక్కడ గౌతమ్ మహర్షి ఘోర తపస్సు చేసిన స్థలం.నచికేత్,యమునికి సంభందించిన కధ ఇక్కడే జరిగింది. నచికేత్ యముడి కోసం తపస్సు చేయగా యముడు జ్ఞాన బోధ చేసిన ప్రాంతం.ఇక్కడ దత్త మూర్తి ఆదిశంకరులు వర్ణించిన యోగ లో ఉన్న షట్ చక్రాలు దత్త మూర్తి లో కలిగిన సాలిగ్రామo తో చేయబడిన సుందర  ధ్యాన మూర్తి దత్త.స్వామి వక్షస్థలంలో  అగ్ని,గోముఖ్o, నొసటన అజ్ఞాచక్రం, గొంతు దగ్గర విశుద్ది చక్రం,నాభి లో మణి పూరకం,హృదయం దగ్గర కమలం,క్రిందగా 4 రేకులు కలిగిన ములధార చక్రం అనాహిత చక్రాలు సూక్ష్మంగా కనపడతాయి.ఈ విగ్రహం నల్లగా ఉన్న సాలిగ్రామ మూర్తి.ఇక్కడ ఔదుంబర్ వృక్షం లో స్వయంభూ గణపతి వున్నారు.ఇక్కడ గురుచరిత్ర పారాయణ జరుగుతుంది.సప్తాహ  పారాయణ చేసుకునే వారికి భక్త నివాస్ ఉంది.భోజనం కూడా దొరుకుతుంది.
శ్రీ క్షేత్ర బాలోద్, తాలూకా జగడియా,జిల్లా బరూచ్,గుజరాత్.
Ph no.02645-243603
M.no_07738360880

Thanks to sai SARANAM Shirdi tour, Chennai
9840344634 / 9087666333
www.saisaranam.in

Monday, 2 September 2019

కాశీ.....#Vandanam కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు.

కాశీ.....#Vandanam

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం...

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.

విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న
ప్రత్యేక స్థలం.

ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని.
ప్రపంచ సాంస్కృతిక నగరం.
స్వయంగా శివుడు నివాసముండె నగరం.

ప్రళయ కాలంలో మునగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి,
కాలభైరవ దర్శనము
అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....
డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.
మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు.
కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.

అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు
అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి
ఎన్నో వున్నాయి.

అందులో కొన్ని.....

1) దశాశ్వమేధ ఘాట్...

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్...

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్...

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్...

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్...

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్...

ఇది కాశీలో మొట్ట మొదటిది.
దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో  తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.
ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది.
ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్...

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు.
ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్...

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్...

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్...

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్...

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్...

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్...

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్...

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్..

నారదుడు లింగం స్థాపించాడు.

16) చౌతస్సి ఘాట్...

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ
64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం...
ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి
64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్...

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18) అహిల్యా బాయి ఘాట్...

ఈమె కారణంగానే మనం ఈరోజు
కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది,
మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

కాశీ స్మరణం మోక్షకారకం...

|| ఓం నమః శివాయ ||

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...