Thursday, 5 September 2019

మౌనవ్రతం వలన కలిగేలాభాలు!

మౌనవ్రతం వలన కలిగేలాభాలు!
మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయనే గర్వం..ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి.

వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు.

మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం. ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.

ఎంత కోపం వచ్చినా, మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు. తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే. తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు, అశాంతి ఉండవు. ప్రపంచమంతా నిశ్చలంగా కనిపిస్తుంది. మాట విలువు తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. మనల్ని మనం సైలెంట్ గా ఉంచుకోవడం ద్వారా అవతలి వారు చెప్పేది వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది. నోటివెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్రసాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది. ఈ సిద్ధి ఉన్నవాళ్లు అన్నది వెంటనే జరిగిపోతుంటుంది. మంచి అయినా చెడు అయినా, వీరు అనగానే ఇట్టే ఫలితం కళ్లముందు కనిపిస్తుంది. మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు. మనకు తెలియకుండానే రోజూ మాట్లాడుతూ, నోటికి చాలా పనికల్పిస్తుంటాం. ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే మన శరీర భాగాలకు కాస్త రెస్ట్ ఇవ్వడం కోసమే, పూర్వీకుల ఇలాంటి వ్రతాల్ని కనిపెట్టారు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది. పరిమితమైన వాక్కు మొత్తం శరీరానికి మంచిది.

వారంలో కేవలం ఒక్కరోజు మౌనవ్రతం చేస్తే పోయేదేమీ ఉండదు. మనలోని వాక్శక్తి ఆదా అవడంతో పాటు, అనవరపు తగాదాల్ని అడ్డుకునే ఈ  మౌనవ్రతం, మనిషికి చాలా అవసరం. వివాదాలకు హద్దులేని నేటి సమాజంలో అత్యవసరం.
                            spirtual message by sai saranam shirdi stours
www.saisaranam.in 9840344634 / 9087666333
 స్వస్తి!

No comments:

Post a Comment

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...