మహాలయ అమావాస్య..కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.
*మహాలయ అమావాస్య.....*
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి - దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.
ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది..
''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు.
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణములు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
*|| ఓం నమః శివాయ ||*
Spiritual message by sai SARANAM Shirdi tour, Chennai.
www.saisaranam.in
9840344634 / 9087666333
Comments
Post a Comment