కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ అర్థం కాదు
కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది.
అది ఎవ్వరికీ అర్థం కాదు .మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను అనుభవించాలి.
నిందిస్తే ప్రయోజనం లేదు. రమణ మహాశయులు కాశీలో
ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవారు.
ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు
గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా తో " కృష్ణా ! నేను
కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు
కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .ఇంతలో ఒక
ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు
మీద పడినది .కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం
చేసుకున్నాడు .కృష్ణా అప్పుడు గ్రహించాడు .
వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో
"మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద
పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు .అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా
జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్పుడో
ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే .రుణం ఎంత తొందరగా
తీరిపోతే అంత మంచింది కదా ! "అని అన్నారు .
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే .
Comments
Post a Comment