Sunday, 24 November 2019
రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి
రామానుజాచార్యుల వారి దివ్య దేహం....
Thursday, 3 October 2019
కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ అర్థం కాదు
కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది.
అది ఎవ్వరికీ అర్థం కాదు .మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను అనుభవించాలి.
నిందిస్తే ప్రయోజనం లేదు. రమణ మహాశయులు కాశీలో
ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవారు.
ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు
గంగానదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా తో " కృష్ణా ! నేను
కట్టుకున్న పంచెను కొంచెం చించు ".అని అన్నారు
కృష్ణా కు అర్ధం కాలేదు .వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు .ఇంతలో ఒక
ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు
మీద పడినది .కాలి వేలు చితికింది .రక్తం కారుతుంది .ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం
చేసుకున్నాడు .కృష్ణా అప్పుడు గ్రహించాడు .
వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో
"మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద
పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా ! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ? " అని ప్రశ్నించారు .అప్పుడు రమణ మహాశయులు కృష్ణా తో " ఆలా
జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ,ఎప్పుడో
ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే .రుణం ఎంత తొందరగా
తీరిపోతే అంత మంచింది కదా ! "అని అన్నారు .
కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే .
Friday, 27 September 2019
Sunday, 8 September 2019
మహాలయ అమావాస్య..కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది.
*మహాలయ అమావాస్య.....*
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి - దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది.
ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది..
''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు.
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణములు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
*|| ఓం నమః శివాయ ||*
Spiritual message by sai SARANAM Shirdi tour, Chennai.
www.saisaranam.in
9840344634 / 9087666333
Thursday, 5 September 2019
మౌనవ్రతం వలన కలిగేలాభాలు!
మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోథ, లోభ, మోహ, మద, మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవోవో కావాలని ఆశ పడటం, అన్నీ ఉన్నాయనే గర్వం..ఇలా మనిషి జీవితమంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమౌతాయి.
వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగానే వాళ్లను మునులు అంటారు.
మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం. ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.
ఎంత కోపం వచ్చినా, మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు. తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే. తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు, అశాంతి ఉండవు. ప్రపంచమంతా నిశ్చలంగా కనిపిస్తుంది. మాట విలువు తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. మనల్ని మనం సైలెంట్ గా ఉంచుకోవడం ద్వారా అవతలి వారు చెప్పేది వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది. నోటివెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్రసాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది. ఈ సిద్ధి ఉన్నవాళ్లు అన్నది వెంటనే జరిగిపోతుంటుంది. మంచి అయినా చెడు అయినా, వీరు అనగానే ఇట్టే ఫలితం కళ్లముందు కనిపిస్తుంది. మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు. మనకు తెలియకుండానే రోజూ మాట్లాడుతూ, నోటికి చాలా పనికల్పిస్తుంటాం. ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే మన శరీర భాగాలకు కాస్త రెస్ట్ ఇవ్వడం కోసమే, పూర్వీకుల ఇలాంటి వ్రతాల్ని కనిపెట్టారు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది. పరిమితమైన వాక్కు మొత్తం శరీరానికి మంచిది.
వారంలో కేవలం ఒక్కరోజు మౌనవ్రతం చేస్తే పోయేదేమీ ఉండదు. మనలోని వాక్శక్తి ఆదా అవడంతో పాటు, అనవరపు తగాదాల్ని అడ్డుకునే ఈ మౌనవ్రతం, మనిషికి చాలా అవసరం. వివాదాలకు హద్దులేని నేటి సమాజంలో అత్యవసరం.
spirtual message by sai saranam shirdi stours
www.saisaranam.in 9840344634 / 9087666333
స్వస్తి!
Wednesday, 4 September 2019
శ్రీ దత్త క్షేత్ర బాలోద్* శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.
*శ్రీ దత్త క్షేత్ర బాలోద్*
శ్రీ దత్త క్షేత్రం నర్మదా నది ఒడ్డున గుజరాత్ లో బురూచ్ జిల్లాలో ఉంది.ఇక్కడ గౌతమ్ మహర్షి ఘోర తపస్సు చేసిన స్థలం.నచికేత్,యమునికి సంభందించిన కధ ఇక్కడే జరిగింది. నచికేత్ యముడి కోసం తపస్సు చేయగా యముడు జ్ఞాన బోధ చేసిన ప్రాంతం.ఇక్కడ దత్త మూర్తి ఆదిశంకరులు వర్ణించిన యోగ లో ఉన్న షట్ చక్రాలు దత్త మూర్తి లో కలిగిన సాలిగ్రామo తో చేయబడిన సుందర ధ్యాన మూర్తి దత్త.స్వామి వక్షస్థలంలో అగ్ని,గోముఖ్o, నొసటన అజ్ఞాచక్రం, గొంతు దగ్గర విశుద్ది చక్రం,నాభి లో మణి పూరకం,హృదయం దగ్గర కమలం,క్రిందగా 4 రేకులు కలిగిన ములధార చక్రం అనాహిత చక్రాలు సూక్ష్మంగా కనపడతాయి.ఈ విగ్రహం నల్లగా ఉన్న సాలిగ్రామ మూర్తి.ఇక్కడ ఔదుంబర్ వృక్షం లో స్వయంభూ గణపతి వున్నారు.ఇక్కడ గురుచరిత్ర పారాయణ జరుగుతుంది.సప్తాహ పారాయణ చేసుకునే వారికి భక్త నివాస్ ఉంది.భోజనం కూడా దొరుకుతుంది.
శ్రీ క్షేత్ర బాలోద్, తాలూకా జగడియా,జిల్లా బరూచ్,గుజరాత్.
Ph no.02645-243603
M.no_07738360880
Thanks to sai SARANAM Shirdi tour, Chennai
9840344634 / 9087666333
www.saisaranam.in
చిత్రగుప్తుడు ఎవరు?
పురాణాల (ముఖ్యంగా పద్మ పురాణం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం మొదలైనవి) ప్రకారం, చిత్రగుప్తుడు బ్రహ్మ దేవుని మానసపుత్రుడు (మనస్సు నుంచి ఉద్భవ...
-
The Ramanathaswamy Temple in Rameshwaram, Tamil Nadu, is famous not only for its architectural grandeur but also for its 22 sacr...
-
Thirunallar Saneeswaran Temple ******** Location: Thirunallar, near Karaikal ********** Significance: One of the Navagraha templ...
-
Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...