జలానరనరసింహుడు-గుడి - బీదర్ లోని ఝర్ణీ నరసింహక్షేత్రం-600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి

600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి - బీదర్ లోని ఝర్ణీ నరసింహక్షేత్రం

బీదర్ ... కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. 

మనదేశం ఆత్యాధ్మిక నిలయం.మనస్సు ప్రశాంతంగా వుండటానికి మనము ఆలయాలను సందర్శిస్తూవుంటాం. అటువంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం ఝరణీ నరసింహక్షేత్రం.

క్రీ.పూ 400 ల సం ల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువైవున్నారని చెబుతున్నారు.మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోటానికి ఒక ప్రత్యేకత వుంది.

చుట్టూ కొండలు పచ్చని ప్రశాంతవంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు దగ్గరలో గల మంగళ్ పేట్ లో నరసింహక్షేత్రం వెలసింది.

ఎలా దర్శించుకోవాలి?

ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి ఝరణీ నరసింహస్వామిని దర్శించుకోవాలి

జలనరసింహుడు అనే పేరు ఎలా వచ్చింది?

జలాసురుడు తన పేరుతో కలిపి భక్తులు పిలిచేవిధంగా వుండాలని చెప్పడంతో ఆ పుణ్యక్షేత్రాన్ని జలనరసింహుడుగా కొలవబడుతున్నారు.

ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట .
అప్పుడు లక్షీ నరసింహ స్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసింహ స్వామి .
ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసింహ స్వామి అక్కడ వెలిశి ' జలానరనరసింహుడు ' గా కొలవబడుతున్నాడు .

Comments

Popular posts from this blog

Tirupati to Tirumala by walking

thiruvanamalai miracle- పటిక బెల్లం లో మూడవవంతు* అరుణాచల ఆలయంలో యదార్ధంగా జరిగిన సంఘటన

క్షీరాబ్ది ద్వాదశి*, *చిలుకు ద్వాదశి* ( update on 12-11-2024)