Tuesday, 5 March 2019

గీతా మకరందము - విభూతియోగము


spiritual message from sai saranam shirdi tours
www.saisaranamyatra.com

 10-36-గీతా మకరందము
          విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ | 
జయోఽస్మి వ్యవసాయోఽస్మి 
సత్త్వం సత్త్వవతామహమ్ || 

తా:- వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును (ప్రభావమును), (జయించువారలయొక్క) జయమును, (ప్రయత్నశీలురయొక్క) ప్రయత్నమును , (సాత్వికులయొక్క) సత్త్వగుణమును అయియున్నాను. 

వ్యాఖ్య:- ప్రపంచములోగల సమస్తపదార్థములందును, మంచివానియందుగాని, చెడ్డవానియందుగాని, భగవానుని అస్తిత్వము కలదు. వారి సాన్నిధ్యమే ప్రపంచములోని సమస్తపదార్థములకు, క్రియలకు శక్తిని ప్రసాదించుచున్నది. ఈ సత్యమును నిరూపించుటకు భగవాను డీ విభూతియోగమున కొందఱు దేవతలను, దానవులను, జంతువులను, జడపదార్థములను, కొన్ని క్రియలనుగూడ పేర్కొనెను. సంక్షేపించి చెప్పుటవలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొనుచుపోయిరి. ఏ వస్తువును జూచినను, ఏ క్రియను పరికించినను అచ్చోట సాక్షాత్ భగవానునియొక్క అస్తిత్వమును భావనచేయవలెను. ఈ ఉద్దేశ్యముచేతనే జూదవిషయ మిచట ప్రస్తావింపబడినది కాని, దానిని ప్రోత్సహించవలెననిగాని, అనుసరించవలెననిగాని, అది ఉపాదేయమనిగాని అభిప్రాయము గాదు. ‘నేను మృగములలో సింహమును’ అని చెప్పినంతమాత్రమున సింహముతో ఆటలాడుకొనుమని అర్థముకాదుగదా! అట్లే ఈ జూదవిషయమున్ను  - అని గ్రహించుకొనవలయును. 
      ‘వ్యవసాయము’ అనగా ప్రయత్నము  తానని భగవానుడే పేర్కొనుటవలన మోక్షవిషయమున ప్రయత్నరహితులుగ, సోమరులుగనుండక సత్ప్రయత్నమాచరించుచుండుట శ్రేయస్కరమని తేలుచున్నది. ఎచట తేజము (ఉత్సాహము , ధైర్యము మున్నగునవి) ఉండునో, ఎచట దయయుండునో, ఎచట సత్ప్రయత్నముండునో, ఎచట సత్త్వగుణముండునో అచట తానుండునని భగవానుడు పలికిరి. కావున ఆ యా సద్గుణములను చక్కగ అలవఱచుకొనవలెను.
thanks from sai saranam shirdi tours

No comments:

Post a Comment

Marathwada Liberation Day or Marathwada Mukti Sangram Din—is celebrated every year on 17th September

Marathwada Liberation Day or Marathwada Mukti Sangram Din—is celebrated every year on 17th September to mark the liberation of the Marathwad...