Saturday, 2 March 2019

శ్రీ కపోతేశ్వర స్వామీ దివ్య సన్నిధి. కడలి గ్రామం .రాజోలు మండలం

కోనసీమలో  దర్శించవలసిన దివ్యక్షేత్రాలు – www.saisaranam.in
శ్రీ కపోతేశ్వర స్వామీ దివ్య సన్నిధి. కడలి గ్రామం .రాజోలు మండలం .తూ.గో.జిల్లా.
ఈ ఆలయం అతి పురాతన మైనది. 15,16 శతాబ్దాల మధ్య నిర్మించబడిన దేవాలయం.
శ్రీ కపోతేశ్వర స్వామీ స్వయం భూ గా వెలసినారు. ఈ ఆలయప్రతిష్ట కు పురాణ ఆధారంగా చెప్పాల్సిన విషయం  ఒకటి ఉన్నది. పూర్వకాలం లో ఒక వేట గాడు వేట నిమిత్తం ఈ ప్రాంతం లో సంచరిస్తూ ఉండగా విపరీతమైన వాన వచ్చినదట, ఆబోయ ఒక చేట్టు నీడను నిలుచున్నాడట, ఎంత సేపటికీ వర్షం తగ్గలేదు . ఆవృక్షం  పైన నివసిస్తున్న పావురాల జంట  ఇతనిని గమనించి చాలాసేపటి నుండి చెట్టుక్రింద నిరాహారం గా వున్నా ఇతనిని చూచి భాదపడి, తమ గూటిని క్రిందకు గెంటి దానిపై చెట్టు బెరడు రాపాడగా వచ్చిన నిప్పుతో మంట రగిల్చి, దానిలో పడి అతనికి ఆహారం గా మారాయట ఇది గమనించిన బోయవాడు పావురాల త్యాగ బుద్దికి చలించి పోయి ఆతను ఆ మంట ను మరింత రగిలించి తనుకూడా అగ్నికి ఆహుతి అయ్యేనట. ఇది కైలాసంలో ఉన్న శివుడు గమనించి కపోతాల త్యాగనిరతికి సంతసించి వాటిని బ్రతికించెనట . ఆకపోతాలు ఆ బోయనుకుడా బ్రతికించమని వేడుకోగా పరమ శివుడు, ఆ బోయకూ  ఆ కపోత జంటకూ  శివసాయుధ్యము అనుగ్రహించి ఈ సందర్భం గా అక్కడ కపోత త్యాగనిరతి కి గుర్తుగా కపోత రూప గుర్తులతో స్వయం భూ గా శివుడు  కపోతేశ్వర స్వామిగా వేలసెనట. శివ  లింగ ము పై ముందు వెనుక కపోత తల, రెక్కలు,పొట్టా ఆకారాలు గుర్తులుగా నేటికీ కనిపిస్తూ ఉంటాయి.
ఈ స్వామిని దర్శించుకుంటే  మానసిక శాంతి కలుగుతుందని, క్షుద్భాధ ఉండదని, అన్న వస్త్రాలకు లోటు రాదని భక్తుల విస్వాశం . శాంతి చిహ్నాలైన కపోత గుర్తు లు కలిగిన కపోతేశ్వర స్వామిని దర్శించిన వెంటనే మనసు కూ స్వాంతన లభిస్తుందని ,ఆందోళనలు , భయాలు, విచారం లో ఉన్నవారికి స్వామిని దర్శించగానే ఆత్మస్థైర్యం వచ్చి  నూతనోత్సాహం తో తలచిన కార్యాల విజయాలు పొందుతారని భక్తులు విశ్వసిస్తారు 
ఈ ఆయము సమీపంలో కపోత కుండము కలదు .ఈ తటాకం లోనికి అంతరవాహినిగా గంగానది ప్రవహిస్తుందని , ఈ కుండము లో జలము గంగాజలము తో సమానమైన పవిత్రత కలిగినదని స్థల పురాణము వలన తెలియుచున్నది. సమీపముననే స్మశాన వాటిక కలదు. ఈ రెండు కారణముల చే ఈ క్షేత్రాన్ని భక్తులు దక్షణ కాశీ గా భావిస్తారు 
శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ ఆలయంలో శ్రీ చక్ర సహిత బాలా త్రిపుర సుందరీ దేవిని ప్రతిష్టించినారని స్థల పురాణము వలన తెలుయుచున్నది.
కపోతేశ్వర స్వామీ ఆలయ ప్రదక్షణ మార్గంలో వినాయకుడు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రుడు, కుమారస్వామి,శ్రీ సీతా రాములు,నవగ్రహాలు,కాలభైరవుడు ,లింగ రూపుడుగా శ్రీ సూర్యనారాయణ మూర్తి వారల ఉపాలయాలు ఉన్నవి.
ఈ క్షేత్రానికి పాలకుని  గా జనార్ధన స్వామీ కొలువై ఉపాలయములో ఉన్నారు.
ఈ ఆలయం సమీపాన సువర్చలా సమేత ఆంజనేయ స్వామీ ఆలయం,మరియు శ్రీ, భూ,సమేత శ్రీ సత్యనారాయణ స్వామీ ఆలయములు కలవు.
కడలి గ్రామము అమలాపురం  నుండి రాజోలు వెళ్ళు    N.S.214 రహదారి లోని మామిడికుదురు గ్రామానికి  4 కి.మీ దూరములో ఉన్నది పాలకొల్లు నుండి అమలాపురం వెళ్ళు R.T.C. బస్సులో కానీ అమలమలాపురం నుండి రాజోలు వాళ్ళు బస్సులోగానీ మామిడికుదురు లో దిగి ఆటోలలో కడలి గ్రామము వెళ్ళవచ్చును.
గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతం సందర్శించు భక్తులు కడలి గ్రామములోని శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించి కపోత త్యాగనిరతిని శ్లాఘించి , కపోతేశ్వరస్వామిని అర్చించి తరించండి,
www.saisaranamyatra.com

No comments:

Post a Comment

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...