Sunday, 3 March 2019

శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు

Spiritual messages from www.saisaranam.in.
* మన ఇతిహాసాలు *
*శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు*
మహాభారతంలో శకుని ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇతడు కౌరవుల యొక్క మద్దతుదారు. ఈయన తెలివైన, పదునైన మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా చిత్రీకరింపబడ్డాడు. శకుని కౌరవుల మేనమామ. మీకోసం శకుని గురించి మనకు తెలియని కొన్ని నిజాలు తెలియజేస్తున్నాం. చదివేయండి!
1. శకుని సుబలుని కుమారుడు. మనకు తెలిసిన శకునికి వందమంది మేనల్లుళ్లు ఉన్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన గాంధార రాజైన సుబలుని నూరవ పుత్రుడు. అతని సోదరులందరు చనిపోయారు. కేవలం శకుని మరియు గాంధారి మాత్రమే బ్రతికి బట్టకట్టారు.
2. శకుని చెల్లెలు గాంధారి హస్తినాపుర రాజైన, ధృతరాష్ట్రుడుని వివాహమాడింది. ఈయన పుట్టుకతో గుడ్డివాడు. శకుని, తన తండ్రి ఇష్టంతో జరిపించినప్పటికిని, చెల్లెలు ఒక గుడ్డివాడిని వివాహమాడటాన్ని ఇష్టపడలేదు. చెల్లెలు కూడా, తన భర్తను అనుసరిస్తు జీవితాంతం గుడ్డిదాని వలె, కళ్ళకు గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు,ఆయన కోపం తారాస్థాయికి చేరింది.
3. ఆయన తన తండ్రి వద్దకు , ఈ వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన భీష్ముని ద్వేషించేవాడు.
4. ఒక కథ ప్రకారం, శకుని చెల్లి గాంధారి తన జాతకదోష నివారణార్ధం మేకను మనువాడింది. కానీ ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు వద్ద దాచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు సుబలుని, శకునితో పాటుగా సుబలుని యొక్క మిగిలిన కుమారులను చాలా హింసించాడు. సుబలుని చనిపోయేంత వరకు ఆకలితో మాడ్చి, అతని ఆఖరి కోరిక తెలియజేయమన్నాడు. సుబలుడు, తన కనిష్ట కుమారుడైన శకునిని చంపకుండా విడిచిపెట్టమన్నాడు. ఇలా శకుని తన ప్రాణాలను దక్కించుకున్నాడు.
5. జరిగినదంతా మనసులో పెట్టుకుని, శకుని ధృతరాష్ట్రుడు మరియు భీష్ముని పై కక్ష పెంచుకున్నాడు. ఆ వంశాన్ని మొత్తంగా సర్వనాశనం చేస్తానని ప్రతినబూనాడు. ఈ విధంగా అతను మహాభారతంలో ఒక దుష్ట పాత్రగా అవతరించాడువివాహం మరియు చావులకు ప్రతీకారంగా, మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసేందుకే కంకణం.కట్టుకున్న శకుని, మహాభారత యుద్ధంలో కౌరవులకు సహాయమందిస్తున్నట్లు నటిస్తూ వారి కొంప ముంచాడు.
6. తన తండ్రి చనిపోతూ, శకునిని తన బొమికలతో పాచికలు తయారు చేసి, జూదంలో వాడమని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారం శకుని పాచికలు తయారు చేయడం మాత్రమే కాక, వాటిని తన మాయలో నియంత్రించేవాడుఇలా మాయ చేయడం, హిందూ ధర్మం ప్రకారం నేరం. ఈ పాచికలను ఆయన పాండవులకు ఇచ్చి జూదంలో ఒడిపోయేటట్టు చేసాడు.
7. శకునికి ఉలుక మరియు వృకాసురులనే కుమారులున్నారు. వారు తమ తండ్రిని, వెనక్కు వచ్చి తమతో పాటు తమ రాజ్యంలో ఆనందంగా మరియు సౌకర్యంగా నివసించమని కోరుకున్నారు.కానీ శకుని, ధృతరాష్ట్రుడు మరియు భీష్ముని పై తన పగ చాలకరెవరకు వారి కోర్కెను మన్నించలేదు.
8. గ్రీక్ పురాణాలలో కూడా ప్రస్తావింపబడిన అంబి కుమారుడు, శకుని యొక్క ప్రత్యక్ష వారసునిగా నమ్ముతారు.
9. పాండవులలో ఒకడైన సహదేవుడు, కౌరవుల కొలువులో ద్రౌపదికి జరిగిన అవమానానికి శకుని కారణమని భావించి, మహాభారత యుద్ధ పద్దెనినిమిదవ రోజు, శకునిని అంతమొందించాడు.
Thanks from www.saisaranamyatra.com

No comments:

Post a Comment

108 Names of Lord Rama & Meanings

Here is the Sri Ram Ashtothram (108 Names of Lord Rama) along with their meanings: 1–20 1. Om Ramaya Namah – Salutations to Sri ...